అంతరాష్ట్ర మట్కా నిర్వాహకుడి అరెస్ట్

0

అక్షరటుడే, నిజామాబాద్: తెలంగాణ, మహారాష్ట్రలో పెద్దఎత్తున మట్కా నిర్వహిస్తున్న జమీర్ ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు రూ.కోట్లల్లో మట్కా దందా నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. అతనితో పాటు బినామీ పేరిట ఆస్తులు కూడగట్టినట్లు దర్యాప్తులో తేలింది. గత ఐదేళ్లుగా తెలంగాణతో పాటు మహారాష్ట్రలోని నాందేడ్, ధర్మాబాద్, బిలోలి, వార్ధ, అకోల, అమరావతి ప్రాంతాల్లో మట్కా నిర్వాహకులతో ఉన్న పరిచయాలతో స్థానికంగా ఏజెంట్స్ ద్వారా కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినట్లు బయటపడింది. నిందితుడు జమీర్ ప్రధాన అనుచరులు పరారీలో ఉండగా వారి కోసం గాలింపు జరుపుతున్నారు. ప్రజలు మట్కా ఉచ్చులో చిక్కవద్దని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సూచించారు. నిందితుడు జమీర్ ని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు. కాగా.. నిజామాబాద్ లో భారీ ఎత్తున జరిగే మట్కా వ్యాపారానికి అడ్డుకట్ట వేసిన టాస్క్ఫోర్స్ ఏసిపి రాజశేఖర్ రాజు, నిజామాబాద్ ఏసిపి కిరణ్ కుమార్, టాస్క్ఫోర్స్ సీఐలు అజయ్ బాబు, అంజయ్య, నార్త్ రూరల్ సీఐ సతీష్, ఐదో టౌన్ ఎస్సై అప్పారావు , టాస్క్ఫోర్స్ సిబ్బంది రాములు, అనిల్, సుధాకర్, లక్ష్మన్న, రాంచందర్, అజం బృందాన్ని సీపీ అభినందించారు.