అక్రమ ఆయుధాల కేసులో రిజ్వాన్ అరెస్ట్

0

అక్షరటుడే, నిజామాబాద్: నగరంలో అక్రమ ఆయుధాలు పట్టుబడిన ఘటనలో పరారీలో ఉన్న నిందితుడు రిజ్వాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది నవంబరు 7న టాస్క్ఫోర్స్ పోలీసులు జరిపిన దాడుల్లో నగరంలోని ఓ రైస్ మిల్లులో అక్రమ అయధాలు సీజ్ చేశారు. కత్తులు, తల్వార్లతో పాటు ఓ వెపన్ గుర్తించారు. అనంతరం ఆరో టౌన్ పోలీసులు మీర్ అంజద్ తో పాటు మరికొంత మంది నిందితులని అరెస్టు చేశారు. అప్పటి నుంచి మరో కీలక నిందితుడు రిజ్వాన్ పరారీలో ఉన్నాడు. గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న కంట్రీ మేడ్ వెపన్ రిజ్వాన్ కు చెందినదిగా సమాచారం. పీడీఎస్ అక్రమ దందాలోనూ కీలకంగా వ్యవహరించాడు. కేసు నమోదు తర్వాత సౌదీకి పారిపోయాడు. ఎట్టేలకు పోలీసులకు దొరికాడు.