అక్రమ కట్టడాలను అడ్డుకోవాలి

0

అక్షరటుడే, ఆర్మూర్: పట్టణంలో పలువురు ప్రభుత్వ స్థలాలు కబ్జాచేసి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జివి.నరసింహారెడ్డి అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో అక్రమ కట్టడాన్ని గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. అక్రమ కట్టడాలపై మున్సిపల్ కార్యాలయంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. మామిడిపల్లిలో ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారని తాము గతంలోనే ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మున్సిపల్ కార్యాలయం రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అక్రమార్కులకు అడ్డాగా మారిందని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ద్యాగ ఉదయ్, పులి యుగంధర్, విజయానంద్, పీర్ సింగ్, ఖందేశ్ ప్రశాంత్, చిన్నారెడ్డి, నగేష్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.