అక్షరటుడే, ఆర్మూర్: పట్టణంలోని బస్టాండ్ ముందు రోడ్డును ఆక్రమించుకొని అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలను గురువారం తొలగించారు. మున్సిపల్, ఆర్టీసీ అధికారులు, పోలీసులు కలిసి షాపులను తొలగింపజేశారు. అక్రమంగా దుకాణాలు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు