అక్రమ నిర్మాణాలు జరిగితే చర్యలు

0

అక్షరటుడే,ఆర్మూర్: మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆర్మూర్ హౌజింగ్ బోర్డులోని మున్సిపల్ పది శాతం స్థలాలను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ..ప్రభుత్వ స్థలాలను కొందరు మున్సిపల్ పాలకులే కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయని, వెంటనే టెన్ పర్సంట్ స్థలాలను గుర్తించి చిల్డ్రన్స్ పార్కులుగా తీర్చిదిద్దాలని కమిషనర్ ప్రసాద్ చౌహాన్, టీపీవో హరీష్ కు సూచించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జీవీ నర్సింహారెడ్డి, నాయకులు యామాద్రి భాస్కర్, పాలెపు రాజు, ప్రకాష్, డమాంకర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.