బీజేపీ అభ్యర్థి ధన్ పాల్ సూర్యనారాయణ
అక్షరటుడే, నిజామాబాద్: తాను ఎమ్మెల్యేగా గెలిస్తే నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని నిజామాబాద్ అర్బన్ బీజేపీ అభ్యర్థి ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. నగరంలోని 37వ డివిజన్ లో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ధన్ పాల్ మాట్లాడుతూ.. తొమ్మిదేళ్ళ పాలనలో నగరంలో అవినీతి తప్ప అభివృద్ధి జరగలేదన్నారు. సుందరీకరణ పేరుతో రూ.కోట్ల అవినీతి జరిగిందన్నారు. రాష్ట్రంలో కాళేశ్వరం కేసీఆర్ కి ఏటీఎం అయితే ఇక్కడి అభ్యర్థికి బొడ్డెమ్మ చెరువు మరో ఏటీఎంలా మారిందన్నారు. అవినీతికి పాల్పడే వారు మనకు అవసరమా? అని స్థానిక ప్రజలను ప్రశ్నించారు. ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ పంచరెడ్డి లింగం, జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు, ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బంటు రాము, కార్పొరేటర్లు మాస్టర్ శంకర్, సుక్క మధు, బూరుగుల ఇందిరా వినోద్, ఎర్రం సుదీర్, బంటు వైష్ణవి, పంచరెడ్డి ప్రవళిక శ్రీధర్, మెట్టు విజయ్, మమతా ప్రభాకర్, ఇప్పకాయల సుమిత్ర కిషోర్, వనిత శ్రీనివాస్, పంచరెడ్డి లావణ్య, బీజేపీ నాయకులు భారత్ భూషణ్, గంగోనె గంగాధర్ పాల్గొన్నారు.