అక్షరటుడే, ఇందూరు: అన్ని వర్గాల సంక్షేమమే తన ధ్యేయమని అర్బన్ శాసనసభ్యుడు సూర్యనారాయణ గుప్తా అన్నారు. మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో శనివారం క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం కుల మతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తోందని చెప్పారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేయర్ నీతూ కిరణ్, మైనారిటీ శాఖ అధికారిణి కృష్ణవేణి, జోసెఫ్, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.