అమిత్ షాను కలిసిన ఆర్వింద్

0

అక్షరటుడే, నిజామాబాద్: కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షాను నిజామాబాద్ ఎంపీ అర్వింద్ గురువారం కలిశారు. ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయిన ఆయన ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని ఏడు నియోజకవర్గాల్లో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతాన్ని వివరించారు. గతంతో పోలిస్తే గణనీయంగా ఓటు బ్యాంక్ పెరిగినట్లు అర్వింద్ ఆయనకు తెలిపారు. రెండు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు గెలిచారని, పార్లమెంట్ పరిధిలో బీజేపీ చాలా బలపడిందని ఎంపీ పేర్కొన్నారు. అనంతరం తెలంగాణకు సంబంధించిన ఇతర విషయాలపై కూడా చర్చించారు.