అర్బన్ అభ్యర్థిగా షబ్బీర్ అలీ

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ అభ్యర్థిగా షబ్బీర్ అలీ ఖరారయ్యారు. ఈ నెల 7న(మంగళవారం) ఆయన నామినేషన్ వేయనున్నారు. ఇందుకోసం ఆయన అనుచరులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే రోజు నగరంలో భారీ ర్యాలీ, సభ నిర్వహించనున్నట్లు తెలిసింది. ఆదివారం ముఖ్య కార్యకర్తలతో రామాయంపేటలోని తన ఫాంహౌజ్ లో సమావేశం ఏర్పాటు చేశారు. అర్బన్ నియోజకవర్గంలో మైనార్టీల ఓట్లు 1.20 లక్షలు పైబడి ఉండటం, కామారెడ్డి లో రేవంత్ పోటీ చేయనుండటంతో ఇక్కడ షబ్బీర్ పేరును ఖరారు చేసినట్లు తెలిసింది.