అర్హులందరికీ ‘ఆరు గ్యారంటీలు’

0

అక్షరటుడే, ఎడపల్లి: అర్హులందరికీ ఆరు గ్యారంటీలను అందిస్తామని బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఠాణాకలాన్‌, కుర్నాపల్లి నుంచి నిజామాబాద్‌కు ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల సౌకర్యం కోసం ఆర్టీసీ బస్సును ప్రారంభించామని తెలిపారు. నియోజక వర్గంలోని సమస్యలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని, తాము పరిష్కరిస్తామని పేర్కొన్నారు. అనంతరం ఎడపల్లి మండలంలోని జాన్కంపేట, ఠాణాకలాన్‌, కుర్నాపల్లి, మంగళ్‌పాడ్‌, ఎడపల్లి గ్రామాల్లో పర్యటించారు.