అర్హులందరికీ లబ్ధి చేకూరాలి

0

అక్షరటుడే, ఆర్మూర్‌: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా అర్హులందరికీ లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి అన్నారు. ఆలూర్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు కేంద్ర పథకాలపై అధికారులు అవగాహన కల్పించాలన్నారు. దరఖాస్తులను స్వీకరించడమే కాకుండా అర్హులందరికీ లబ్ధి జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ప్రజల వద్ద నుంచి దరఖాస్తులను స్వీకరించారు.