అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి

0

అక్షరటుడే, బోధన్: అర్హులందరూ ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలని బోధన్ ఆర్డీవో రాజా గౌడ్ సూచించారు. బోధన్ లో గురువారం జాతీయ ఓటరు దినోత్సవం జరిపారు. ఈ సందర్భంగా పట్టణంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్ పాల్గొన్నారు.