అక్షరటుడే, ఆర్మూర్: పట్టణ మున్సిపల్ కౌన్సిల్ ఛైర్ పర్సన్ అవిశ్వాస పరీక్షపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. అవిశ్వాసం పెట్టిన 20 మంది కౌన్సిలర్ల ను మాజీ ఎమ్మెల్యే సోదరుడు రాజేశ్వర్ రెడ్డి బస్సులో కౌన్సిల్ సమావేశానికి తీసుకువచ్చారు. మరోవైపు బీజేపీ నలుగురు కౌన్సిలర్స్ వేరుగా సమావేశానికి హాజరయ్యారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సైతం ఎక్స్ అఫిషియో హోదాలో సమావేశానికి హాజరయ్యారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ తో పాటు ఆమె మద్దతుదారులు ఇప్పటివరకు సమావేశానికి చేరుకోకపోవడం గమనార్హం. దీంతో కౌన్సిల్ లో ఏం జరుగుతుందో అన్నది ఉత్కంఠగా మారింది.