ఆటోవాలాల నిరసన ర్యాలీ

Advertisement

అక్షరటుడే, బాన్సువాడ: మహాలక్ష్మి పథకంతో తాము ఉపాధి కోల్పోతున్నామని బాన్సువాడలో గురువారం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి ఆర్డిఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆర్డీవో భుజంగరావుకు వినతి పత్రం అందజేశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. యూనియన్ అధ్యక్షుడు భూషణ్ గౌడ్, శ్రీనివాస్, మొగులా, ఆగమయ్య, గంగారాం, సాయ గౌడ్ పాల్గొన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Banswada | బాన్సువాడ డీఎల్​పీవోగా సత్యనారాయణ రెడ్డి