అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: ఆటోల్లో పరిమితికి మించి విద్యార్థులను స్కూళ్లకు తరలిస్తున్న ఆటో డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని టీబీవీపీ నగర కమిటీ నాయకులు కోరారు. గురువారం కమిటీ అధ్యక్షుడు అఖిల్ ఆధ్వర్యంలో ఏసీపీకి ఫిర్యాదు చేశారు. పరిమితికి మించి విద్యార్థులను ఆటోల్లో ఎక్కించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, తనిఖీలు జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.