ఆర్మూర్ లో గంజాయి పట్టివేత

0

అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ ఎక్సైజ్ పోలీసులు గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం జరిపిన తనిఖీల్లో రాజేష్ ముక్యా నుంచి 220 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ కి తరలించారు. ఈ తనిఖీల్లో ఆర్మూర్ ఎక్సైజ్ సీఐ స్టీవెన్సన్, ఎస్సై గంగాధర్, ప్రమోద్ చైతన్య, గంగాధర్ గౌడ్, దేవిదాస్, సాయిబాబా గౌడ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.