ఆసుపత్రిలో ఏర్పాట్ల పరిశీలన

0

అక్షరటుడే, ఆర్మూర్: కరోనా కేసుల వ్యాప్తి నేపథ్యంలో ఆర్మూర్ ఏరియా ఆసుపత్రి అధికారులు అప్రమత్తమయ్యారు. వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రిలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఆక్సిజన్ సౌకర్యం, ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. ఆస్పత్రి పర్యవేక్షకుడు నాగరాజు గురువారం ఏర్పాట్లను పరిశీలించారు. అత్యవసర సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.