అక్షరటుడే, బాన్సువాడ: ఇంటి, కుళాయి పన్ను బకాయిల వసూలుకు బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో అధికారులు గురువారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి బకాయిలను వసూలు చేశారు. మార్చి 3 లోగా బకాయిలు చెల్లించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ తుల శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.