ఇచ్చిన హామీలన్ని పూర్తి చేశా..

0

అక్షరటుడే, బాన్సువాడ: గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని నూరు శాతం పూర్తి చేశానని బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వర్ని మండలం సిద్దాపూర్, శ్యాంరావు తండా, కోకల్ దాస్ తండా, చల్క తండా, గుంటూరు క్యాంప్‌, పైడిమల్, చింతల్ పేట తండాలో ఆదివారం ప్రచారం నిర్వహించారు. కోకల్ దాస్ తండావాసులు ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతూ తీర్మాన పత్రాన్ని పోచారానికి అందజేశారు. పోచారం సురేందర్ రెడ్డి, బద్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.