ఇద్దరు బైక్ దొంగల అరెస్ట్

0

అక్షరటుడే, ఇందూరు: నగరంలో వరుసగా బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ ఇంఛార్జి ఏసీపీ విజయసారథి తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. రైల్వే స్టేషన్ సమీపంలో చేపట్టిన తనిఖీల్లో నగరానికి చెందిన చంద్రశేఖర్, సతీశ్ అనుమానంగా కనిపించారని, వారిని అదుపులోకి తీసుకొని విచారించగా బైక్ చోరీలు చేసినట్లు ఒప్పుకున్నట్లు ఏసీపీ తెలిపారు. నిందితుల నుంచి నాలుగు వాహనాలు సీజ్ చేసి రిమండ్ కి తరలించినట్లు తెలిపారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన సీఐ నరహరి బృందాన్ని ఏసీపీ అభినందించారు.