అక్షరటుడే, బాన్సువాడ: నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలపై త్వరలో సమగ్ర విచారణ చేయిస్తామని జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేత ఏనుగు రవీందర్ రెడ్డితో కలిసి మంగళవారం బాన్సువాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో కొందరు నేతలు అక్రమ తవ్వకాలు జరిపారని, వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను దోచుకున్నారని తెలిపారు. దోచుకున్న ఇసుక సొమ్మునంత నేతలు వారి బినామీల నుంచి కక్కిస్తామని తెలిపారు. క్రిమినల్ కేసులు నమోదు చేసి రెవెన్యూ రికవరీ యాక్ట్ ని ప్రయోగిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ నాయకుడు రాములు హత్య కేసులో నిందితులు ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని పేర్కొన్నారు.