అక్షరటుడే, నిజామాబాద్: ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించరాదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రస్తుత ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ నిర్వహించరాదన్నారు. అలాంటి వార్తలను మీడియాలో ప్రసారం చేయారాదని సూచించారు. నవంబర్ 7 నుంచి 30వ తేదీ వరకు ఎగ్జిట్ పోల్స్ ను నిషేధించినట్లు తెలిపారు.