అక్షరటుడే, నిజామాబాద్: డిచ్పల్లి స్టేషన్ నుంచి తప్పించుకున్న హరియాణకు చెందిన గొలుసు దొంగ ఎట్టకేలకు చిక్కాడు. నిర్మల్ జిల్లా శివారులోని ఓ టోల్ ప్లాజా వద్ద మంగళవారం రాత్రి నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో డిచ్పల్లి సర్కిల్ అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నాను. మంగళవారం ఉదయం స్టేషన్ లోని బాత్రూం కిటికీ నుంచి నిందితుడు తప్పించుకున్న సంగతి తెలిసిందే. నిందితుడిని తిరిగి పట్టుకునేందుకు దాదాపు వంద మంది పోలీసులు గాలింపు జరిపారు.