ఎన్నికల్లో పని చేయించుకొని జీతం ఎగ్గొట్టిన నేత

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: అసెంబ్లీ ఎన్నికల తర్వాత జిల్లాకు చెందిన ఓ నేత చుట్టూ వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన తప్పిదాలు, అక్రమాలు బయట పడుతున్నాయి. తాజాగా కాల్ సెంటర్ పేరిట ఉద్యోగులకు జీతం ఎగ్గొట్టినట్లు వెలుగులోకి వచ్చింది. ఆర్మూర్ కేంద్రంగా సదరు నేత 60 మంది ఉద్యోగులతో ఎన్నికల కోసం కాల్ సెంటర్ నడిపించారు. ఒక్కొక్కరికి నెలకు రూ.9 వేలు చొప్పున జీతం చెల్లించారు. నాలుగు నెలలు పని చేయించుకొని కేవలం మూడు నెలల జీతం మాత్రమే ఇచ్చారని బాధిత ఉద్యోగులు వాపోతున్నారు. ఎన్నికల సమయంలో రేయింబవళ్ళు తమతో పని చేయించుకొని జీతం ఇవ్వకుండా తిప్పించుకోవడంపై మండిపడుతున్నారు. ఇదే విషయమై సదరు నేత పీఏకి కాల్ చేసినా స్పందన లేదని, తాము పోలీసులను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు బాధితులు తెలిపారు.