అక్షరటుడే, బోధన్: పట్టణంలోని ఏకచక్రేశ్వరాలయంలో బుధవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. భక్తుల నుంచి కానుకల ద్వారా మొత్తం రూ.1,35,265 వచ్చినట్లు దేవాదాయ శాఖ జిల్లా ఇన్‌స్పెక్టర్ కమల, ఈవో రవీందర్‌గుప్తా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ బీర్కూర్ శంకర్ పాల్గొన్నారు.