ఏటీఎంలో చోరీకి విఫలయత్నం

అక్షరటుడే, నిజామాబాద్: నగరంలోని ఓ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం జరిగింది. ఆర్ఆర్ చౌరస్తాలో ఉన్న ఆంధ్రా బ్యాంక్ ఏటీఎంలో శుక్రవారం అర్థరాత్రి ఓ నిందితుడు చోరీకి యత్నించాడు. రెండు గంటల పాటు ప్రయత్నించినా ఏటీఎం తెరుచుకోలేదు. కాగా యంత్రాన్ని ధ్వంసం చేసినట్లు సమాచారం. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Nizamabad | నన్ను ఎన్​కౌంటర్​ చేయండి : యువకుడి సెల్ఫీ వీడియో కలకలం