ఏసీబీ వలలో మరో అధికారి

0

అక్షరటుడే, బాన్సువాడ: నిజామాబాద్ ఏసీబీ వలలో మరో అధికారి చిక్కారు. బిచ్కుంద మండల అగ్రికల్చర్ అధికారి పోచయ్య రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా మంగళవారం పట్టుబడ్డారు. ఫర్టిలైజర్ షాపు యజమాని గంగాధర్ పైన కేసు నమోదు చేయకుండా ఉండేందుకు గాను ఏవో పోచయ్య లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు నిజామాబాద్ లోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం ఓ మధ్యవర్తి సాయంతో లంచం తీసుకుంటుండగా పోచయ్య అధికారులకు చిక్కాడు. ఇదిలా ఉండగా.. నెలన్నర వ్యవధిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నాలుగు ఏసీబీ కేసులు నమోదు కావడం గమనార్హం.