కలెక్టర్ ముందే అధికారికి మహిళ క్లాస్

0

అక్షరటుడే, నిజామాబాద్: కలెక్టరేట్ లో సోమవారం జరిగిన ప్రజావాణిలో ఓ జిల్లా స్థాయి అధికారి విచిత్ర పరిస్థితి ఎదుర్కొన్నారు. ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన వేల్పూర్ కు చెందిన కొండి లక్ష్మి ల్యాండ్ సర్వే ఏడీకి క్లాస్ తీసుకుంది. తాను ఎన్నిసార్లు భూమి సర్వే పెట్టుకున్నా చేయట్లేదంటూ ఆగ్రహించింది. కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతుతో పాటు అదనపు కలెక్టర్ల ముందే ఈ పరిణామం చోటు చేసుకుంది. ప్రజావాణిలో ఉన్న ఇతర అధికారులు ఈ ఘటనతో ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తన భూమి సర్వే చేయించకుండా అడ్డుకుంటున్నారని మహిళ ఆరోపించింది. మంత్రిగా ఉన్నపటి నుంచి ప్రశాంత్ రెడ్డి సర్వే చేయనివట్లేదని తెలిపింది.