అక్షరటుడే, ఎల్లారెడ్డి: కల్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డలకు వరం లాంటిదని ఎమ్మెల్యే మదన్మోహన్ రావు అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన లబ్ధిదారులకు శుక్రవారం ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని 164 మందికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండింటిని అమలు చేస్తున్నామని, మరో రెండు పథకాలను త్వరలోనే అమలు చేయనున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్కరికి కూడా రేషన్ కార్డ్ ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ప్రభాకర్, మండలాల తహశీల్దార్లు, లింగంపేట జడ్పిటీసీ ఏలేటి శ్రీలత, ఎల్లారెడ్డి ఎంపీపీ మాధవి గౌడ్, నాగిరెడ్డిపేట జడ్పిటీసీ మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
కల్యాణ లక్ష్మి పేదింటి ఆడబిడ్డలకు వరం
Advertisement
Advertisement