కాంగ్రెస్ లో చేరిన ఆకుల లలిత

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత ఎట్టకేలకు కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో శుక్రవారం తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇటీవల రాహుల్ గాంధీ జిల్లా పర్యటనలోనే ఆమె పార్టీలో చేరాల్సి ఉన్నా..జిల్లా కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించారు. ఎట్టకేలకు ఢిల్లీలో చేరిక జరిగింది. లలిత చేరికతో నిజామాబాద్ అర్బన్ టికెట్ కేటాయింపు వ్యవహారం మరింత ఉత్కంఠగా మారింది.