అక్షరటుడే, నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ మహేష్ బాబు సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు సీపీ వి .సత్యనారాయణ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఓ మహిళతో ఫోన్ లో సంభాషణ జరిపి భార్యాభర్తలిద్దరి మధ్య విభేదాలకు కానిస్టేబుల్ మహేష్ కారకుడయ్యాడు. ప్రాథమికంగా విధుల నుంచి తొలగిస్తూ తదుపరి విచారణ కోసం ఏసీపీ కిరణ్ కుమార్ కు బాధ్యతలు అప్పగించారు.