అక్షరటుడే, నిజామాబాద్ నగరం: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో కార్మికులకు ఇచ్చిన హామీలను సత్వరమే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శంకర్ గౌడ్, నూర్జహాన్ డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులు, ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాలన్నారు. గత ప్రభుత్వం కార్మికుల సమస్యలను విస్మరించిందని.. ఫలితంగా తొమ్మిదేళ్లు కార్మికులకు అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంఘాల సూచనలు పరిగణలోకి తీసుకొని కార్మికులందరికీ న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఏ.రమేష్ బాబు, కార్యదర్శి నన్నే సాబ్, మోహన్, కొండ గంగాధర్, గణేష్, శోభ, స్వప్న, సరిత, పుష్ప, శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.