అక్షరటుడే, బాన్సువాడ: మండలంలోని కొత్తబాది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. ఒకటో తరగతి విద్యార్థి ఫర్హాన్(6) కాల్వలో పడి మృతి చెందాడు. ఆడకుంటున్న సమయంలో పాఠశాల వెనుకాల ఉన్న కాల్వలో ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. కాసేపటికి ఈ విషయాన్ని గుర్తించారు. పాఠశాల ప్రహరీ లేకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.