కాసుల బాలరాజు ఆత్మహత్యాయత్నం

Advertisement

అక్షరటుడే, బాన్సువాడ: కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపాటు కు గురైన కాసుల బాలరాజు ఆత్మహత్యాయత్నం చేశాడు. బుధవారం పట్టణంలో ఆమరణ దీక్ష చేపట్టిన ఆయన పురుగుల మందు తాగాడు. వెంటనే ఆయన్ను అనుచరులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాన్సువాడ నుంచి ఆయన కాంగ్రెస్ టికెట్ ఆశించగా.. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. నిజామాబాద్ లో షబ్బీర్ మంగళవారం ర్యాలీ నిర్వహించగా బాలరాజు అనుచరులు పురుగుల మందు డబ్బాలతో వచ్చి నిరసన తెలిపారు. తాజాగా బాలరాజు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. మెరుగైన చికిత్స కోసం ఆయన్ను నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. రెండ్రోజుల కిందట బాలరాజుతో పాటు ఆయన కుమారుడు కాంగ్రెస్ తరపున నామినేషన్ వేశారు. పోచారం భాస్కర్ రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ బాన్సువాడ ఆసుపత్రిలో బాలరాజు కుటుంబీకులను కలిశారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  BANSWADA | పనిఒత్తిడితో ఏఈ ఆత్మహత్యాయత్నం