అక్షరటుడే, బోధన్: కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సూచించారు. శనివారం బోధన్ నియోజకవర్గ పరిధిలోని ఎడపల్లి మండలం ఠానాకలాన్ లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆవాస్ యోజన పథకం ద్వారా ఇంటి నిర్మాణం కోసం కేంద్రం పేదలకు ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు. అయుష్మాన్ భారత్ పథకం, ముద్ర రుణాల ద్వారా ఎంతో మందికి లబ్ధి జరిగిందన్నారు. బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జి మోహన్ రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కేంద్ర పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
Advertisement
Advertisement