కేషాపూర్ గ్రామంలో ఉద్రిక్తత

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ రూరల్ మండలం కేషాపూర్ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సత్యం రెడ్డి శుక్రవారం చికిత్స పొందుతూ మృతి చెందగా.. మృతదేహంతో గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. పది రోజుల కిందట ఇదే గ్రామానికి చెందిన గంగాధర్, చిన్నా రెడ్డితో కలిసి సత్యం రెడ్డి విందులో పాల్గొన్నారు. ఆయనపై మద్యం మత్తులో దాడి చేయగా అప్పటి నుంచి నిజామాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందతున్నారు. శుక్రవారం సత్యం రెడ్డి మృతి చెందగా గ్రామంలో ఆందోళన చేపట్టారు. నిందితుడి ఇంటి వద్ద మృతదేహంతో బైఠాయించారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.