కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు

0

అక్షరటుడే, బోధన్: కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బోధన్ ఏసిపి కిరణ్ కుమార్ హెచ్చరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా బోధన్ డివిజన్ పరిధిలో కోడిపందేలు, జూదం ఆడకుండా నిఘా ఉంచామన్నారు. ఎక్కడైనా కోడిపందేలు నిర్వహిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.