క్యాన్సర్ చికిత్సకు ఆర్థిక సాయం

0

అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: నగరంలోని ఏడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత బాలిక చికిత్సకు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందించారు. కోటగల్లి ప్రాంతానికి చెందిన సంజీవ్ అశ్విని దంపతుల కూతురు మనో శ్రేష్ట గత ఆరు నెలలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. స్పందించిన ఏడీ ఫౌండేషన్ ప్రతినిధి అంతిరెడ్డి విజయ్ పాల్ రెడ్డి బుధవారం రూ.లక్ష సాయాన్ని అందించారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తమ కూతురు చికిత్స కోసం దాతలు ముందుకు వచ్చి సాయం చేయాలని తలిదండ్రులు కోరారు.