అక్షరటుడే, బోధన్: రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత్ పరిషత్ జిల్లా శాఖ నూతన సంవత్సర క్యాలెండర్ ను బుధవారం ఆవిష్కరించారు. డీఈఓ దుర్గాప్రసాద్ చేతులమీదుగా క్యాలెండర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పురాణే అజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి కాలే గోపాల్, గౌరవ అధ్యక్షుడు కేసి. లింగం, శివకుమార్, కోర్బా రాము, జమీల్ పాషా తదితరులు పాల్గొన్నారు.