గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

0

అక్షరటుడే, నిజామాబాద్: నగరంలో గంజాయి విక్రయిస్తున్న సయ్యద్ సాజిద్ ను అరెస్ట్ చేసినట్లు నగర సీఐ నరహరి తెలిపారు. నిందితుడు మహరాష్ట్ర నుంచి గంజాయి తీసుకువచ్చి స్థానికంగా విక్రయిస్తునట్లు తెలిపారు. సాజిద్ నుంచి 1,250 గ్రా. గంజాయి, రూ.10 వేలు నగదు సీజ్ చేసి అతన్ని రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన మూడో టౌన్ ఎస్సై ప్రవీణ్, సిబ్బంది అప్సర్ బృందాన్ని సీఐ అభినందించారు. సాజిద్ గతంలో కూడా గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డాడు. నిందితుడు తల్లి ఖాజాబీ పైన కూడా గంజాయి కేసులు ఉన్నాయి.