గల్ఫ్ లోనూ జిల్లా ఏజెంట్ల మోసాలు

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: నిన్నా మొన్నటి వరకు జిల్లాకు పరిమితమైన గల్ఫ్ ఏజెంట్ల మోసాలు ఏకంగా దేశాలు దాటాయి. గల్ఫ్ దేశాల్లోనూ జిల్లాకు చెందిన ఏజెంట్లు మోసాలకు పాల్పడుతున్నారు. నందిపేట్ కు చెందిన ఏజెంట్ ఒకరు దుబాయ్ లో మోసం చేసిన ఉదంతం తాజాగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. నందిపేట్ మండలానికి చెందిన పది మంది ఓ ఏజెంట్ ద్వారా కొద్ది నెలల కిందట గల్ఫ్ దేశానికి వెళ్ళారు. అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వారి పేరిట రుణాలు, క్రెడిట్ కార్డులు తీసుకొన్నట్లు బయట పడింది. ఇలా బాధితుల పేరిట దాదాపు కోట్లలో రుణాలు పొందడంతో చివరకు తాము మోసపోయామని గుర్తించి బాధితులు తిరిగి స్వదేశానికి వచ్చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీపీ కల్మేశ్వర్ ఆదేశాలతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కీలక నిందితుడు మాత్రం ఇంకా పోలీసులకు చిక్కలేదు. టాస్క్ఫోర్స్ పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.