గాడిదతో నామినేషన్ కు వచ్చిన యువకుడు

0

అక్షరటుడే, బాన్సువాడ: అసెంబ్లీ ఎన్నికల్లో ఓ నిరుద్యోగి వినూత్నంగా నిరసన తెలిపాడు. గాడిదతో బాన్సువాడ ఆర్వో కార్యాలయానికి నామినేషన్ వేసేందుకు వచ్చాడు. బీర్కూర్ మండలానికి చెందిన యువకుడు భాస్కర్ కొంత కాలంగా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాడు. విసిగిపోయిన అతను సోమవారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు.. తనతో పాటు ఓ గాడిదను వెంట తీసుకు వచ్చాడు. అక్కడే ఉన్న పోలీసులు గాడిదను అడ్డుకొని యువకుడిని నామినేషన్ వేసేందుకు అనుమతించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.