అక్షరటుడే, బోధన్: మండలంలోని బర్దిపూర్ లో గుప్త నిధుల కోసం ఇంట్లో తవ్వకాలు జరిపిన ఘటన కలకలం రేపింది. పలువురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో అద్దెకు ఉంటున్న బోగిపి రాజు అతని కుటుంబీకులు కలిసి ఇంట్లో తవ్వకాలు జరిపారు. దీనికి సదరు ఇంటి యజమాని ప్రధాన కారణమని వారు తెలిపారు. బోధన్ రూరల్ ఎస్ఐ నాగనాథ్ ఆధ్వర్యంలో తవ్వకాలు జరిపిన ఇంటిని పరిశీలించారు. గుప్తనిధుల తవ్వకాల కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి శ్రీమన్నారాయణతో పాటు బోధన్ కు చెందిన సాయిలుని పిలిపించినట్లు విచారణలో తేలింది.