గ్రామ కార్యదర్శి సంతకం ఫోర్జరీ

0

అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట మండలం పర్మల్ల పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. కార్యదర్శి శ్వేత తెలిపిన వివరాల ప్రకారం.. పర్మల్ల గ్రామానికి చెందిన రావుల శ్రీనివాస్ తన కుమార్తె వివాహాన్ని గతేడాది సెప్టెంబరులో జరిపించారు. కల్యాణ లక్ష్మి కోసం దరఖాస్తు చేసుకోగా పెళ్లి కుమార్తె వయసు 18 సంవత్సరాల కంటే తక్కువగా ఉండడంతో ఆ దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. ఆ తర్వాత శ్రీనివాస్ గ్రామ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి పెండ్లి జరిగిన తేదీని మార్చాడు. నూతనంగా పెళ్లి పత్రిక ముద్రించి ఆ ఫైల్ ను ఎంపీడీవో కార్యాలయంలో సమర్పించాడు. ఆ ఫైల్ ఫై ఎంపీడీవో సైతం అటాచ్డ్ సంతకం చేసి ఎమ్మార్వో కార్యాలయానికి పంపగా.. విచారణలో సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు బయటపడింది.