చివరి ఆయకట్టు వరకు నీరందిస్తాం

0

అక్షరటుడే, బాన్సువాడ: నిజాంసాగర్‌ చివరి ఆయకట్టు వరకు సాగు నీరందిస్తామని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ బాన్సువాడ ఇన్‌చార్జి ఏనుగు రవీందర్‌రెడ్డి అన్నారు. బుధవారం బీర్కూర్‌ మండలం బైరాపూర్‌, బీర్కూర్‌ తండా గ్రామాల మధ్య గల 25, 26 డిస్ట్రిబ్యూటరీ కాల్వలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 26/4 కాలువ నిర్మాణ పనులకు సంబంధించిన అనుమతుల కోసం ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని, పనుల మంజూరుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. కాలువ నిర్మాణ పనులు పూర్తయితే నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.