అక్షరటుడే, ఇందూరు: నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి రత్నమ్మ(70) భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. థైరాయిడ్ సమస్యతో వచ్చిన వృద్ధురాలు రెండో అంతస్తు వార్డులో చికిత్స పొందుతోంది. వార్డులో కల్లు తాగుతుంటే సిబ్బంది వద్దని మందలించారు. వేకువ జామున 4 గంటల ప్రాంతంలో కిటికీ మార్గం నుంచి దూకి మృతి చెందింది. ఈ ఘటనపై ఒకటో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.