జీజీహెచ్ లో నూతన సంవత్సర వేడుకలు

అక్షరటుడే, నిజామాబాద్ నగరం: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మంగళవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. సూపరింటెండెంట్ డా.ప్రతిమా రాజ్ ఆధ్వర్యంలో న్యూ ఇయర్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అలాగే..ఆస్పత్రిలో సంవత్సరం క్రితం గుండె నొప్పితో ప్రసవానికి వచ్చిన సౌందర్య తనకు మెరుగైన వైద్యం అందించినందుకు కృతజ్ఞతగా పుట్టిన బిడ్డకి ప్రతిమ అని పేరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా.. చిన్నారి ప్రతిమ మొదటి పుట్టినరోజు వేడుకలను డాక్టర్ ప్రతిమా రాజ్ సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు.

Advertisement
Advertisement
Advertisement