అక్షరటుడే, ఆర్మూర్: ఎమ్మెల్యే, ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి నియోజకవర్గంలో ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. పలు చోట్ల ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. సోమవారం లక్కంపల్లిలో ఆయన ప్రచారం ఉండగా స్థానికులు గో బ్యాక్ ఫ్లెక్సీ లు ఏర్పాటు అయ్యాయి. పోలీసులు వాటిని తొలగించారు. ఆదివారం కూడా ఓ గ్రామంలో జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు.