అక్షరటుడే, వెబ్ డెస్క్: అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో కీలక మార్పు జరిగింది. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా దీపా దాస్ మున్షీని ఏఐసీసీ నియమించింది. ప్రస్తుత ఇంఛార్జి థాక్రేకు గోవా బాధ్యతలు అప్పగించింది. గతంలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేసిన దీపా దాస్ తాజాగా రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరిశీలకురాలిగా వ్యవహరించారు.