ట్రాఫిక్ చలానాల రాయితీ గడువు పొడిగింపు

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: పెండింగ్ ట్రాఫిక్ చలానాల రాయితీని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 31 వరకు రాయితీపై పెండింగ్ చలానాలు చెల్లించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. వాస్తవానికి బుధవారంతో గడువు ముగియనుండగా సర్వర్ సమస్యతో చాలా మంది వాహనదారులు చలానాలు చెల్లించలేకపోయారు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాయితీ ప్రకటించిన తర్వాత ఇప్పటివరకు రూ.107 కోట్ల ఆదాయం వచ్చింది.